హీరోయిన్ పూర్ణ కొడుకు ఫొటోస్ వైరల్.. ఎత ముద్దుగా ఉన్నాడో!

by Dishanational2 |
హీరోయిన్ పూర్ణ కొడుకు ఫొటోస్ వైరల్.. ఎత ముద్దుగా ఉన్నాడో!
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ లో అఖండ వంటి సినిమాలో పవర్ఫుల్ పాత్ర పోషించి.. ప్రేక్షకులకు దగ్గరైన ఈమె గత కొంతకాలం క్రితం దుబాయ్ కి చెందిన బిజినెస్ మాన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం చేసుకున్న ఏడాదికే పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

అయితే పూర్ణ తనకు కొడుకు పుట్టినప్పటి నుంచి తన కుమారుడి ఫొటోస్ బయట పెట్టలేదు. కాగా పూర్ణ కొడుకు ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తన కొడుకు, భర్తతో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ తన కొడుకుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అచ్చం తల్లిలాగే ఉన్నాడంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed