కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసిన మృణాల్ ఠాకూర్.. ఖరీదు ఎంతంటే?

by Dishafeatures1 |
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసిన   మృణాల్ ఠాకూర్.. ఖరీదు ఎంతంటే?
X

దిశ, సినిమా: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ప్రజంట్ ఉన్న హీరోయిన్‌లు అంతా అదే చేస్తున్నారు. వారి చేతిలో ఆఫర్‌లు ఉన్నప్పుడే ఫుల్ గా సంపాదిస్తూ లగ్జరి లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి తన నటన, అందం తో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక గత సంవత్సరం తన రెండో సినిమా ‘హాయ్ నాన్న’ తో ప్రేక్షకులను పలకరించి మరో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ తో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పాటు మరి కొన్ని వరుస చిత్రాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక తాజాగా మృణాల్ ముంబైలోని అంధేరి ప్రాంతంలో కొత్తగా ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. గతంలో ఇది హీరోయిన్ కంగనా రౌనత్ తండ్రి సోదరుడికి సంబంధించిన ఫ్లాట్ . ఇప్పుడు మృణాల్ సొంతం చేసుకుంది. ఇక దీని నికర విలువ ఎంత అనేది తెలియదు కానీ ఇంచుమించు రూ.10 కోట్లు ఉండొచ్చు అని అంచనా.

Read More..

21 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్..! (వీడియో)



Next Story