పెళ్లిలో అవమానాలు ఎదుర్కొన్న నాగచైతన్య హీరోయిన్.. ఆమెను సర్ప్రైజ్ చేసిన నయనతార జంట

by Disha Web Desk 7 |
పెళ్లిలో అవమానాలు ఎదుర్కొన్న నాగచైతన్య హీరోయిన్.. ఆమెను సర్ప్రైజ్ చేసిన నయనతార జంట
X

దిశ, వెబ్‌డెస్క్: నాగచైతన్య హీరోగా.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ మంజిమ మోహన్. ఈ భామ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. హీరో గౌతమ్ కార్తీక్, మంజిమ ప్రేమించుకుని.. చెన్నైలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లిలో మంజిమ చాలా అవమానం ఎదుర్కోన్నానని తెలిపింది. తాను అధిక బరువు ఉండటం వల్ల పెళ్లికి వచ్చిన వారిలో కొందరు వధువు చాలా లావుగా ఉందంటూ కామెంట్ చేశారట.

దీంతో ఆమె నా బరువుతో నాకు సమస్య లేదు. నేను నా వరకు చాలా ఫిట్‌గా ఉన్నాను. నాకు తగ్గాలని అనిపించినప్పుడు తగ్గుతానని పేర్కొందట. ఇదిలా ఉంటే వీరి పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు, అభిమానుల నుంచి.. శుభాకాంక్షలు, గిఫ్టులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నయనతార, విగ్నేష్ ఈ జంటను సర్ప్రైజ్ చేశారు. నయన్ విగ్నేష్‌లు.. ''డియర్ మంజిమ, గౌతమ్ మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. విక్కీ, నయన్‌ల నుంచి మీరు విషేష్'' అంటూ బొకే, కేక్ పంపారు. దీంతో ఈ కొత్త జంట చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.


READ MORE

వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి

Next Story

Most Viewed