Allu Arjun పబ్‌కి తీసుకెళ్లి నాతో ఆ పని చేయించాడు.. Hansika షాకింగ్ కామెంట్స్..!

by Disha Web Desk 6 |
Allu Arjun పబ్‌కి తీసుకెళ్లి నాతో ఆ పని చేయించాడు.. Hansika షాకింగ్ కామెంట్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ హన్సిక అల్లు అర్జున్‌తో జంటగా నటించిన చిత్రం ’దేశముదురు‘. ఈ సినిమాతోనే ఈ భామ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ అభిమానులకు అలరిస్తోంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన సందర్భాలను గుర్తుచేసుకుంది. ‘‘ఓసారి నా పుట్టిన రోజు అని చిత్ర యూనిట్ కి చెప్పాను. వెంటనే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో అల్లు అర్జున్ ఇద్దరూ పబ్ కి తీసుకువెళ్లి బలవంతంగా వేడిగా ఉండే పాలు నా నోట్లో పోశారు. అంతేకాదు ఆ తర్వాత ఏవేవో తాగడానికి ఇచ్చారు. అయితే నేను అప్పుడే 15 సంవత్సరాలు ముగించుకొని 16వ బర్త్ డే చేసుకుంటున్నాను. ఇక ఆ ఏజ్ లో నాకు పబ్ అంటే ఏంటో కూడా తెలియదు. అంతే కాదు పబ్ కు వెళ్లడం కూడా అదే మొదటిసారి. ఇక నేను రాను అన్న కూడా వినకుండా అల్లు అర్జున్, పూరి జగన్నాథ్‌లు ఇద్దరు నన్ను బలవంతంగా అక్కడికి తీసుకువెళ్లారు’’ అంటూ హన్సిక చెప్పుకొచ్చింది.

Also Read: పాపం మళ్లీ Niharikaను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. కారణం ఏమిటంటే?

Next Story

Most Viewed