‘చియాన్-64’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ ఎవరంటే?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ‘వీర ధీర శూరన్-2’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

‘చియాన్-64’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ ఎవరంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ‘వీర ధీర శూరన్-2’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ హిట్ ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చియాన్ విక్రమ్, ప్రేమ్ కుమార్(Prem Kumar) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీ ‘చియాన్-64’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కావడంతో కోలీవుడ్ ప్రేక్షకులు సంతోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్‌నేషనల్ సంస్థపై కుష్మితగణేష్,నితిన్సథ్యా,సూరియరుణ,ప్రోయువ్రాజ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘చియాన్-64’ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasant) రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ పాత్రలో ఈ అమ్మడు కరెక్ట్‌గా సూట్ అవుతుందని భావించిన మూవీ టీమ్ ఆమెకు స్టోరీ చెప్పడంతో.. రుక్మిణి కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినగట్లు టాక్.

ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు లక్కీ చాన్స్ కొట్టేసిందని అంటుంటే మరికొందరు మాత్రం ఆయనతో నటిస్తే కెరీర్ రిస్క్‌లో పడుతుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా రుక్మిణి వసంత్ మదరాసి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’లోనూ నటిస్తోంది. వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ అమ్మడు క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

Next Story