- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌ని అరెస్ట్ చేయాలంటూ హీరోయిన్ డిమాండ్.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) తమిళనాడు (Tamil Nadu)కరూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.

దిశ, సినిమా: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) తమిళనాడు (Tamil Nadu)కరూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. కరూర్‌లో ‘మీట్ ది పీపుల్’ పేరుతో జరిగిన ఈ ఈవెంట్ సెప్టెంబర్ 27న శనివారం జరగ్గా.. ఇందులో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. విజయ్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వెళ్లగా.. విజయ్ రూపాన్ని కళ్లనిండి నింపుకుని ఏకంగా 39 మంది తొక్కిసలాటలో మరణించారు. మరో 60 మందికి పైగా అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో పేదల బతుకుల్లో విషాదం నెలకొంది. ఇక ఈ ప్రమాదంపై పలు పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఈ విషాదంపై ఇప్పటికే ఎంతోమంది.. నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా, హీరోయిన్ ఓవియా(Oviya Singh) ఓ సంచలన పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘‘ పేదల బతుకుల్లో విషాదం నింపిన విజయ్‌ని అరెస్ట్ చేయాలి’’ అనే పోస్ట్ పెట్టి చిక్కుల్లో పడింది. ఇక ఈ పోస్ట్ నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన విజయ్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిడుతున్నారు.
దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో భయపడిపోయిన ఓవియా ఆ పోస్ట్ డిలీట్ చేసింది. అంతేకాకుండా తనను తిడుతూ పోస్టులు పెట్టిన స్క్రీన్‌షాట్లు షేర్ చేసింది. దీంతో పాటు ఓ కొటేషన్ కూడా పెట్టింది. ‘‘జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది. మూర్ఖులకు ఆట... ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఓవియాపై మండిపడుతున్నారు. నువ్వు ఒక మూర్ఖురాలివి మా హీరో కాదని అంటున్నారు.






