- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్ సీన్స్ చాలా బోరింగ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన చిన్నారి పెళ్లికూతురు!
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో మంచి ఫేమస్ సంపాదించుకున్న బ్యూటీ అవికా గోర్. ఈమె సీరియల్ తర్వాత తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో

దిశ, సినిమా : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో మంచి ఫేమస్ సంపాదించుకున్న బ్యూటీ అవికా గోర్. ఈమె సీరియల్ తర్వాత తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఈ బేబీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తాను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3,బ్రో, పాప్ కార్న్, ఉమాపతి వంటి సినిమాల్లో నటించింది. అయినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ వైపు కన్నేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఆమె మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన విషయం తెలిసిందే. తర్వాత బోల్డ్‌గా ముద్దు సీన్స్‌లలో రెచ్చిపోయి చేసింది. గతేడాది వచ్చిన 1920 అనే హారర్ మూవీలో ఈ బ్యూటీ చాలా హాట్ సీన్స్ చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికాను యాంకర్. సెక్స్ సీన్స్ , కిస్సింగ్ సీన్స్ చేయడం మీకు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందని ప్రశ్నించగా ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చింది.
అవికా మాట్లాడుతూ.. అందరూ సెక్స్ సీన్స్ చేయడం చాలా సరదాగా భావిస్తారు కానీ అవి చాలా బోరింగ్ అంటూ పేర్కొంది. అలాగే అలాంటి సీన్స్ తనతో పాటు మిగితా నటీనటులు కూడా చాలా సౌకర్యవంతంగా చేయడానికి కారణం కృష్ణా భట్ కారణం అని ఆమె తెలిపింది.1920లో రొమాంటిక్ సీన్స్ చేస్తున్న క్రమంలో .. తమ కంటే ఎక్కువగా విక్రమ్ సర్‌నే సిగ్గుపడి పోయారు. ఆయన ఇలాంటి సీన్స్‌తో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాగే తోటి నటులు కూడా ఇలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు, తనను టచ్ చేసే ముందు పర్మిషన్ తీసుకొని టచ్ చేస్తారు, సినిమాల్లో లవ్ మేకింగ్ సీన్ల లాంటివి అన్నీ ఉంటాయి. కానీ చాలా వరకు అందులో శరీరం ఎక్కడా బయటకు కనిపించదు, దర్శకులు అలా చూపిస్తారు అంతే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవికా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






