- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా(Malaika Arora) ‘బిచ్చో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా(Malaika Arora) ‘బిచ్చో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే మలైకా అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలువలేదు. మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పిల్లాడి బాధ్యతను మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. ఈక్రమంలోనే మలైకా తనకంటే 12ఏళ్ల చిన్న వాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది.
కొద్ది కాలం పాటు వీరిద్దరు పలు పార్టీలకు, వెకేషన్లకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక వీరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకునే సమయానికి విడిపోయి అందరికీ షాకిచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా అరోరా రెండో పెళ్లిపై అనౌన్స్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘నేను అర్బాజ్ ఖాన్ భార్యభర్తలుగా విడిపోయినా నా కొడుకు కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాం. ఇప్పుడు వాడికి 22 ఏళ్లు వచ్చాయి. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. విడాకుల వల్ల నా కొడుకు ఎఫెక్ట్ కాకూడదని ఇద్దరం కలిసి బాధ్యత తీసుకున్నాం. అయితే గతంలో నేను డైవర్స్ గురించి ప్రకటించగానే నాకు నీతులు చెప్పారు.
నేను కూడా విడాకులు తీసుకోవాలని అనుకోలేదు. కలిసి ఉండాలనే అనుకున్నా కానీ అలా జరగలేదు. డైవర్స్ తీసుకున్నాను అని అందరూ తప్పంతా నాదే అన్నట్లు నా వైపు వేలు చూపించారు. సెల్ఫిష్‌గా ఆలోచించానని అన్నారు. నేను ఆనందంగా ఉండాలని వివాహబంధం నుంచి బయటకు వచ్చాను. ఆ నిర్ణయం నన్ను మెరుగైన వ్యక్తిగా మార్చడానికి సహాయపడిందని నేను భావిస్తున్నాను. నేను చెప్పినట్లుగా, నేను హార్డ్‌కోర్ రొమాంటిక్‌ని. నేను ప్రేమను నమ్ముతాను. ప్రేమ గురించి అన్ని విషయాలను నేను నమ్ముతాను. కాబట్టి మంచి వ్యక్తి దొరికితే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.






