అలాంటి సినిమాలు చేయడానికి హీరోలు భయపడుతున్నారు.. తాప్సీ పన్ను సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

హీరోయిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథల్లో నటించడానికి హీరోలు నిరాకరిస్తున్నారు.

అలాంటి సినిమాలు చేయడానికి హీరోలు భయపడుతున్నారు.. తాప్సీ పన్ను సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటంలో ముందుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, సినీ పరిశ్రమలో హీరోల మనస్తత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించేందుకు హీరోలు భయపడుతున్నారని ఆమె బాంబు పేల్చారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ పురుషాధిక్యత కొనసాగుతోందని తాప్సీ పరోక్షంగా విమర్శించారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"హీరోయిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథల్లో నటించడానికి హీరోలు నిరాకరిస్తున్నారు. ఒక సినిమాలో నేను డబుల్ రోల్ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. మేకర్స్ ఒక స్టార్ హీరోను సంప్రదిస్తే, కథలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిసి ఆయన అభద్రతా భావంతో వెనక్కి తగ్గారు" అని తాప్సీ చెప్పుకొచ్చారు.కేవలం సీనియర్ లేదా స్టార్ హీరోలే కాకుండా, ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువ హీరోలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారని తాప్సీ విమర్శించారు. కేవలం హీరోయిన్ చుట్టూ తిరిగే సినిమాల్లో తాము కనిపిస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందని వారు భయపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

కథ బాగున్నా సరే, హీరోయిన్ డామినేషన్ ఉంటుందనే కారణంతో మంచి ప్రాజెక్టులను వదులుకోవడం ఆశ్చర్యకరమని ఆమె అన్నారు. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆమెను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, కానీ హీరోలు మాత్రం ఇంకా పాత ధోరణిలోనే ఉండటం బాధాకరమని తాప్సీ అభిప్రాయపడ్డారు.

Next Story