'KGF chapter 3' పై క్లారిటీ ఇచ్చిన యశ్

by Disha Web Desk 17 |
KGF chapter 3 పై క్లారిటీ ఇచ్చిన యశ్
X

దిశ, సినిమా: కన్నడ సూపర్ స్టార్ హీరో యశ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం 'కె జి ఎఫ్'. ఈ సినిమా 'కెజిఎఫ్: చాప్టర్ 2'గా కూడా రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే మూవీ క్లైమాక్స్‌లో 'చాప్టర్ 3' కూడా ఉందనే హింట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. అలాగే సినిమా కూడా త్వరలోనే రూపొందించబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

ఇక ఈ విషయంపై నిన్న ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు యశ్. 'కెజిఎఫ్' రెండు సినిమాలను ఆడియన్స్ ఎంతో ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అయితే వాటికి కొనసాగింపుగా 'చాప్టర్ 3' తెరకెక్కుతుందని నేను భావించడం లేదు. ఇక ఆ మూవీ పై ప్రస్తుతం ప్రచారం అవుతున్న కథనాలను అభిమానులు నమ్మవద్దు. ఒకవేళ దానికి సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఉంటే స్వయంగా నేను అందరికీ తెలియజేస్తా' అంటూ క్లారిటీ ఇచ్చాడు.



Next Story

Most Viewed