- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు ప్రమాదం.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
by Satheesh |
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్ మూవీ షూటింగ్‌లో భాగంగా బుధవారం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విక్రమ్‌కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన తంగలాన్ మూవీ యూనిట్ విక్రమ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ పక్క టెముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు అపరేషన్ అవసరమని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విక్రమ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక, తమిళ్ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న తంగలాన్ మూవీలో హీరోగా విక్రమ్ నటిస్తుండగా.. ఆయన సరసన మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు యాక్ట్ చేస్తున్నారు.
Next Story






