‘బిచ్చగాడు 3’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ

by Dishaweb |
‘బిచ్చగాడు 3’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోనీ
X

దిశ, సినిమా: కోలివుడ్ హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిచ్చగాడు 2’. తాజాగా విడుదలైన ఈ మూవీ మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది. కాగా మొదటి భాగం విజయవంతమై, రెండో భాగం కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా.. ఈ మూవీకి కొనసాగింపుగా మరో చిత్రం కూడా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయంపై స్పందించిన విజయ్ ఆంటోనీ.. ‘‘బిచ్చగాడు 3’ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది’ అని తెలిపాడు. అలాగే ‘బిచ్చగాడు 3’ మూవీకి కూడా విజయ్ ఆంటోనీ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని టాక్. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ మూడో భాగం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: పెళ్లికి ముందే గర్భం దాల్చిన బాలీవుడ్ బ్యూటీ.. ఇంట్లో చెప్పడంతో..

Next Story