టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సూర్య?

by Disha Web Desk 6 |
టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సూర్య?
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ రెంజ్ విపరీతంగా పెరిగిపోయింది. మన తెలుగు ఇండస్ట్రీ పేరు విదేశాల్లో సైతం మారుమోగిపోతుంది. దీంతో తెలుగు మూవీస్‌లో నటించేందుకు ప్రతి ఒక్క హీరో మక్కువ చూపిస్తున్నాడు. బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ చిత్రాల్లో అథిది పాత్రల్లో అలరించగా.. ఇప్పుడు కోలివుడ్ సైతం టాలీవుడ్ బాట పడుతుంది. స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’, ధనుష్ ‘సార్’ సినిమాలు రెండు భాషల్లోనూ మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. అయితే స్టార్ హీరో సూర్య కూడా తెలుగులో నటించేందుకు సిద్ధం అయ్యారు. ‘సీతారామం’ మూవీతో మంచి ఫేమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు హను రాఘవపూడితో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

Read more:

Ram Charan : టాప్ హీరో కొడుకైనా.. భార్యతో ఉన్నప్పుడు ఆ పని చేయాల్సిందేనంటున్న ఫ్యాన్స్!



Next Story

Most Viewed