- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hero Raj Tarun: బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో రాజ్ తరుణ్ ?
ఈ మధ్య కాలంలో రియాలిటీ షోస్ ప్రేక్షకాదరణ పొంది మంచి రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి .

దిశ, సినిమా : ఈ మధ్య కాలంలో రియాలిటీ షోస్ ప్రేక్షకాదరణ పొంది మంచి రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి . వాటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఈ షో అన్ని భాషల్లో హిట్ అయింది. తెలుగులో ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 8 వ సీజన్ కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ నడుస్తున్నంత సేపు విమర్శలు చేస్తూనే ఉంటారు సీజన్ ముగిసాక మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని వేచి చూస్తారు. షో రన్నింగ్ టైంలో వాళ్ళు ఇట్లా.. వీళ్ళు అట్లా అని కామెంట్స్ చేస్తూనే చూస్తుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎంత గానో వేచి చూస్తున్నారు. సీజన్ 8 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మన ముందుకు రానుంది. కానీ కొందరు ఆగస్టు రెండవ వారం నుంచే మొదలు పెట్టడంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 8లో కి ఎవరు వస్తున్నారని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మొన్నటి వరకు ఇద్దరూ అమ్మాయిల మధ్యలో నలిగిపోయిన హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో? కాదో తెలుసుకోవాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.






