- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై రెమ్యూనరేషన్ లేకుండానే సినిమాలు ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ.. హీరో నితిన్ కు (Nithin) ఉన్న ప్రత్యేకత అంతా కాదు. ఇండస్ట్రీలో ఒక్కో

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ.. హీరో నితిన్ కు (Nithin) ఉన్న ప్రత్యేకత అంతా కాదు. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చాడు. అప్పట్లో జయం, దిల్, సై లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న హీరో నితిన్... ఆ తర్వాత డిజాస్టర్ బాట పట్టాడు. ఇక మళ్లీ 2012 తర్వాత ఇష్క్ సినిమాతో గాడిలో పడ్డాడు హీరో నితిన్. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకున్నాడు.
అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ నితిన్ చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇటీవల తమ్ముడు (Thammudu) సినిమాతో కూడా బొక్క బోర్లా పడ్డాడు హీరో నితిన్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ తరుణంలోనే ఈ సినిమా విషయంలో రెమ్యూనరేషన్ కూడా కాస్త తగ్గించే తీసుకున్నాడట హీరో నితిన్. ఇక అటు బలగం సినిమాతో పాపులర్ అయిన వేణు తో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడట ఆ హీరో నితిన్.
ఈ సినిమాలో మొదట నానిని అనుకున్నప్పటికీ.. మళ్లీ నితిన్ చేతికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే తమ్ముడు సినిమా డిజాస్టర్ కావడంతో... ఎల్లమ్మ సినిమాను ఫ్రీగా చేయాలని హీరో నితిన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఎల్లమ్మ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత... రెమ్యూనరేషన్ అడగాలని అనుకుంటున్నాడట నితిన్. ప్రొడ్యూసర్ కష్టాలు నితిన్ కుటుంబానికి బాగా తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడట.






