- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాంకర్ రష్మిని నా లైఫ్‌లో మరిచిపోలేను.. ప్రత్యేక బంధంపై హీరో నితిన్ సంచలన కామెంట్స్.. వీడియో వైరల్
‘జయం’తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నితిన్.. ఆ తర్వాత తనదైన స్టైల్‌లో సినిమాలు తీస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన.. ఓ టీవీ కార్యక్రమంలో ఫస్ట్ మూవీ జ్ఞాపకాలను పంచుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ‘జయం’తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నితిన్.. ఆ తర్వాత తనదైన స్టైల్‌లో సినిమాలు తీస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన.. ఓ టీవీ కార్యక్రమంలో ఫస్ట్ మూవీ జ్ఞాపకాలను పంచుకున్నాడు. నిజానికి జయం మూవీకి హీరోయిన్‌గా ఫస్ట్ సెలెక్ట్ చేసింది యాంకర్ రష్మిని అని చెప్పాడు. తొంభై శాతం ఆమెను ఫిక్స్ అయిపోయాక.. చివరలో మరో హీరోయిన్‌ను పెట్టారని తెలిపాడు. అయితే తాను ఫస్ట్ రిహార్సల్ చేసిన హీరోయిన్ రష్మి అని.. ఆ విధంగా తనను లైఫ్‌లో మరిచిపోలేనని చెప్పుకొచ్చాడు. ఆ విధంగా తమ మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని పంచుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఆ ఛాన్స్ రష్మికి చిక్కితే.. కచ్చితంగా లైఫ్ మరోలా ఉండేదని అంటున్నారు అభిమానులు. స్టార్ హీరోయిన్‌గా మారేదని.. అదృష్టం కలిసి రాకపోవడంతో ఇలా యాంకర్‌గా మిగిలిపోయిందని బాధపడుతున్నారు. ఏదేమైనా ఇలా కూడా తను ఓ స్టార్ అని.. ఇండస్ట్రీలో ప్రత్యేకతను కలిగి ఉందని ఖుష్ అవుతున్నారు.






