యాంకర్ సుమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హీరో గోపిచంద్! మెడ పట్టుకుని..

by Disha Web Desk 9 |
యాంకర్ సుమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హీరో గోపిచంద్! మెడ పట్టుకుని..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో గోపిచంద్.. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘రామబాణం’’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ మే 5న భారీ అంచనాలతో విడుదల కానుంది. ఇందులో జగపతి బాబు, ఖుష్బూ, నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథానాయిక డింపుల్ హయతి. అయితే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. చిత్ర యూనిట్ స్టార్ యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘‘ సుమ అడ్డా’’ షోకు శ్రీవాస్, గోపీచంద్, డింపుల్ హయతి పాల్గొన్నారు. ఈ షోలో సరదాగా కాసేపు నవ్వుల వర్షం కురిపించారు. ‘‘ గోపిచంద్ సుమపై సెటైర్లు వేశాడు.

మీరు హీరోయిన్ అయితే అందులో నేను విలన్‌ నటిస్తాను అంటూ సుమను ఆటపట్టించాడు. ఇక సుమ.. భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే సతీమణి అలుగుందని అనడంతో, షోలన్నీ కంప్లీట్ చేసుకొని మీరు డేలీ ఇంటికి ఆలస్యంగా వెళ్తారు కదా..మరీ? అంటూ హీరో మళ్లీ పంచ్ వేశాడు. తర్వాత సుమ వారితో ఓ మనీ గేమ్ ఆడించింది. ఆట మధ్యలోనే ఏమైందో తెలియదు.. గోపిచంద్ వైల్డ్‌గా ప్రవర్తిస్తూ సుమ గొంతు పట్టుకున్నాడు. ఇక సుమ ముఖం భయంతో అలాగే ఉండిపోయింది. షోలో ఆడియన్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఈ హీరో యాంకర్ గొంతు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో తెలియాలంటే ఏప్రిల్ 29న విడుదలయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : ఆ ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్.. దెబ్బకు వైరల్

Next Story

Most Viewed