ఒకరికి హీరో.. మరొకరికి విలన్.. సంచలనంగా నటి పోస్ట్

by Disha Web Desk 7 |
ఒకరికి హీరో.. మరొకరికి విలన్.. సంచలనంగా నటి పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందంతో, నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. కేవలం సైడ్ క్యారెక్టర్స్‌కు మాత్రమే పరిమితం అయింది. అయినప్పటికీ ఈ అమ్మడుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. అయితే.. ఏం అయిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది పూనమ్ కౌర్. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెడుతూ నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టింది.

ఈ మేరకు.. ‘ఒకరి జీవితంలో హీరోగా ఉన్నవారు.. మరొకరి జీవితంలో విలియన్ కావచ్చు. సామూహిక ప్రయోజనం ప్రకారం వారి చుట్టూ నేరేటివ్ సృష్టిస్తారు’ అంటూ ట్వీట్ చేసింది. అయితే.. ఎవరి గురించి ఈ ట్వీట్ పెట్టిందో మెన్షన్ చేయలేదు కానీ.. అందరూ డైరెక్టర్ త్రివిక్రమ్‌ను మధ్యలోకి లాగుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూనమ్ త్రివిక్రమ్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ట్వీట్ చేయడంతో ఇన్‌డైరెక్ట్‌గా ఆయన్నే అంటుందా అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Next Story