ఆమె చిరునవ్వు మరువలేనిది మ్యాజిక్ చేస్తుంది.. ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మంగ స్పెషల్ వీడియో రిలీజ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 08:54:03  IST  )

మె చిరునవ్వు సరళమైనది, కానీ అందులోని మాధుర్యం మరువలేనిది.. కచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది.

ఆమె చిరునవ్వు మరువలేనిది మ్యాజిక్ చేస్తుంది.. ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మంగ స్పెషల్ వీడియో రిలీజ్
X

దిశ, సినిమా: సూపర్‌స్టార్ కృష్ణ గారి వారసుడిగా, మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ‘మంగళవారం’ ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ద్వారా జయకృష్ణ టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నటిస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో రాషా చాలా అందంగా, డెబ్యూ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని కళలతో కనిపిస్తోంది. అయితే ఇందులో ఈ భామ మంగ పాత్రలో నటిస్తోంది.

ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ మేకర్స్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. "ఆమె చిరునవ్వు సరళమైనది, కానీ అందులోని మాధుర్యం మరువలేనిది.. కచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది" అంటూ రాషా అందాన్ని, ఆమె నవ్వును పొగిడేశారు. కేవలం ఈ ఒక్క మాటతోనే సినిమాలో ఆమె పాత్ర ఎంత హుందాగా, క్యూట్‌గా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన ఘట్టమనేని అభిమానులు కూడా రాషాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఈ జోడీ కెమిస్ట్రీ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అజయ్ భూపతి తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే రాషా తడానీని టాలీవుడ్‌కు పరిచయం చేస్తుండటంతో, ఆమె పాత్ర చుట్టూనే కథ తిరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో కావడంతో జయకృష్ణ డెబ్యూపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story