ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్.. ‘మిరాయ్’ నుంచి స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-03 03:04:21  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్.. ‘మిరాయ్’ నుంచి స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ ‘మిరాయ్’(Mirai)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మజోన్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, ట్విట్టర్ ద్వారా ‘మిరాయ్’ నుంచి స్టార్ హీరోయిన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఇందులో ఆమె హీరో తల్లి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ అంబిక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పవర్ ఫుల్ లుక్ షేర్ చేస్తూ ‘‘మిరాయ్‌లో సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జా అలరించబోతున్నారు. ఇందులో ఆయన తల్లి పాత్రలో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో శ్రియా నటించారు. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో హీరో తల్లి పాత్ర చాలా స్ట్రాంగ్ అండ్ ఎమోషన్‌తో ఉండబోతుంది. ప్రతి సూపర్ హీరో ప్రయాణం వెనుక ఆమె బలం దాగి ఉంటుంది’’ అని తెలిపారు. ఇక పోస్టర్‌లో శ్రియా శరణ్ పొగ మంచుల మధ్యలో కూర్చుని చేతులు జోడించి దండం పెడుతూ కనిపించగా.. ఆమె చేతిలో మంటలు వస్తున్నాయి. ఈ పవర్ ఫుల్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

Next Story