Henry Cavill confirms he is 'not' returning as Superman

by Chukka Sudharani |   (  Updated:2023-08-08 08:36:04  IST  )

బ్రిటీష్ యాక్టర్ హెన్రీ కావిల్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన ఆయన..

Henry Cavill confirms he is not returning as Superman
X

దిశ, సినిమా: బ్రిటీష్ యాక్టర్ హెన్రీ కావిల్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. తాను ఇకపై సూపర్ మ్యాన్‌గా తిరిగిరావడం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న ఆయన.. 'ఇటీవలే జేమ్స్ గన్ అండ్ పీటర్ సఫ్రాన్‌లతో చర్చించాను. నేను సూపర్‌మ్యాన్‌గా తిరిగి రానని చెప్పడం అందరికీ విచారకరమైన వార్త. ఇది అంత తేలికైనది కాదని నాకు తెలుసు. కానీ అదే జీవితం కాదు. నేను దానిని ఉన్నతంగా గౌరవిస్తాను. జేమ్స్ అండ్ పీటర్‌లకు మరిన్ని చిత్రాలు నిర్మించడానికి అవకాశం ఉంది. కొత్త విశ్వంలో పాలుపంచుకునే వారందరికీ శుభాకాంక్షలు. అందరికీ అదృష్టం వరించాలని సంతోషంగా కోరుకుంటున్నా' అంటూ ముగించాడు.

దీనిపై ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. 'నీ అభిమానులుగా మేమెంతో నిరాశకు గురయ్యాం. మీరు ఎల్లప్పుడూ మాకు ఒక సూపర్‌మ్యాన్‌ సోదరుడిగానే ఉంటారు. ఇది విన్నందుకు క్షమించండి. ఏం చెప్పాలో తెలియడం లేదు' అంటూ నిరాశ చెందుతున్నారు. ఇక 2013 సూపర్‌హిట్ మ్యాన్ ఆఫ్ స్టీల్‌తో సూపర్‌మ్యాన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన హెన్రీ.. దీని తర్వాత Batman V, సూపర్‌మ్యాన్: డాన్ ఫర్ జస్టిస్ (2016), జస్టిస్ లీగ్ (2017)లో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

Next Story