అడ్డంగా బుక్కైన హేమ.. రేవ్ పార్టీకి వెళ్లింది నిజమేనంటూ బయటకు వచ్చిన పక్కా ఫ్రూప్స్!

by Samataha |
అడ్డంగా బుక్కైన హేమ.. రేవ్ పార్టీకి వెళ్లింది నిజమేనంటూ బయటకు వచ్చిన పక్కా ఫ్రూప్స్!
X

దిశ, సినిమా : సీనియర్ నటి హేమ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసిన ఈ నటి పేరే వినిపిస్తుంది. ఆమె బెంగుళూరు రేవ్ పార్టీకి నేను అటెండ్ కాలేదంటూ ఆడి డ్రామా మాములుగా లేదు. కానీ డ్రగ్ టెస్ట్‌లో ఆమెకు పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. దీంతో ఆమెపై తన అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా రేవ్ పార్టీలో తన పేరు కృష్ణవేణిగా చెప్పుకున్నట్లు కూడా తెలిసిందే. ఇక ఈ రేవ్ పార్టీ ఇష్యూ నుంచి తప్పించుకోవాలని నటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. తాజాగా ఆమె బెంగళూరు రేవ్ పార్టీకి అటెండ్ అయినట్లు మరో ఫ్రూఫ్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన ఆధారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే హేమ రేవ్ పార్టీకి వెళ్లింది నిజమే.. ఇదే సరైన ఆధారం అంటూ ఓ మీడియా సంస్థ వెళ్లడించింది. తాను మే18న హైదరబాద్ నుంచి బెంగళూరుకు మధ్యాహ్నం1.55కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఫ్లైట్ లో వెళ్లినట్లు తేలింది. ఇండిగో 6ఈ- 6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్, తదితరులు బెంగళూరు వెళ్లారని, అక్కడి నుంచి రేవ్ పార్టీ రిసార్ట్‌కు వారు చేరుకున్నట్లు వారు తెలిపారు. ఫ్లైట్ బుకింగ్ కాఫీ ఇదే నంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ రేవ్ పార్టీలో 101 మెంబర్స్ పాల్గొన్నట్లు సమాచారం.





Next Story