మంచు లక్ష్మి వివాదంపై స్పందించిన హేమ.. వారి పేర్లు ప్రస్తావిస్తూ షాకింగ్ వీడియో రిలీజ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-21 02:51:54  IST  )

స్టార్ హీరో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi)నిత్యం వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తోంది.

మంచు లక్ష్మి వివాదంపై స్పందించిన హేమ.. వారి పేర్లు ప్రస్తావిస్తూ షాకింగ్ వీడియో రిలీజ్
X

దిశ, సినిమా: స్టార్ హీరో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi)నిత్యం వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఫుల్ ఫైర్ అయింది. ఆమె వేసుకునే బట్టలు వయసు గురించి ప్రశ్నించడంతో మంచు లక్ష్మి తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన ఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ వివాదంపై గత రెండు రోజుల నుంచి పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, టాలీవుడ్ నటి హేమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ వీడియో షేర్ చేసింది.

‘‘నేనంటే చదువుకోలేదు. మీడియా వారు చాలా చదువుకుని ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి. అసలు బాడీ షేమింగ్ చేయడం ఏంటి. అలాంటి ప్రశ్నలు అడగొచ్చా. ఏది అడగాలి.. ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు అనేది తెలియదా? అని ఫైర్ అయిపోయింది. మీడియా వారు సెలబ్రిటీల గురించి ఎలా మాట్లాడినా కానీ తప్పులేదు. కానీ సెలబ్రిటీలు ఒక చిన్నమాట అంటే క్షమాపణలు చెప్పే వరకు వదలరు. గతంలో సుమ కనకాల మీడియా వారు టిఫిన్లు భోజనం లాగా చేస్తున్నారు అని సదరాగా మాట్లాడిన మాటలను సీయిస్‌గా తీసుకున్నారు. ఆమెతో క్షమాపణలు కూడా చెప్పించుకున్నారు.

అలాగే వేణు స్వామి , సమంత(Samantha), నాగచైతన్యల పెళ్లి గురించి మాట్లాడిన మాటలను కూడా వివాదం చేసి క్షమాపణలు కోరారు. నా విషయంలో కూడా మీడియా వారి ప్రవర్తన అలాగే ఉంది. ఇంత జరుగుతున్న మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏం చేస్తున్నారు. సోదరికి ఇలాంటి అవమానం జరిగినే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నా విషయంలో మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా వెంటనే నన్ను సస్పెన్షన్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకని మీడియా వారిని ప్రశ్నించలేదు. ఇప్పుడు మీ సోదరికి జరిగింది? రేపు మరొక నటికి జరుగుతుంది. ఏం జరిగినా విష్ణు పట్టింకోవాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story