- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ బరిలో హెబ్బా పటేల్.. ‘హరుడు’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్
‘హరుడు’ మూవీ విడుదల తేదీపై మూవీ మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ హెబ్బా పటేల్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా గడుపుతోంది. ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ, ఇటీవల ‘రేపు ఉదయం 10 గంటలకు’ అనే విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘మిరాకిల్’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ లోపే హెబ్బా మరో క్రేజీ మూవీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోయింది. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరుడు’. ఈ చిత్రంలో హీరో వెంకట్, సలోనీ అశ్వనీ, నటాషా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విలక్షణమైన కథాంశంతో దర్శకుడు రాజ్ తాళ్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా. తాజాగా, ఈ మూవీ విడుదల తేదీపై మూవీ మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. సమ్మర్ స్పెషల్‌గా మే 8న ‘హరుడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది వేసవి బరిలో స్టార్ హీరో రామ్ చరణ్ వంటి దిగ్గజాల సినిమాలు పోటీలో ఉండగా, అదే సమయంలో హెబ్బా పటేల్ మూవీ కూడా థియేటర్లలోకి రావడం విశేషం. స్టార్ సినిమాల హడావిడి ఉన్నప్పటికీ, తనదైన మార్క్ కథతో ప్రేక్షకులను మెప్పించేందుకు హెబ్బా సిద్ధమవుతోంది. ‘హరుడు’ అనే టైటిల్, అందులోని సీనియర్ నటుల కాంబినేషన్ చూస్తుంటే, ఇదొక యాక్షన్ డ్రామాలా ఉండబోతోందని అర్థమవుతోంది. మరి ఈ సమ్మర్ రేసులో హెబ్బా పటేల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.






