ఆ తండ్రి నెరవేర్చలేని కోరిక.. హృదయాలను హత్తుకుంటున్న ‘విమానం’ టీజర్

by Disha Web Desk 7 |
ఆ తండ్రి నెరవేర్చలేని కోరిక.. హృదయాలను హత్తుకుంటున్న ‘విమానం’ టీజర్
X

దిశ, సినిమా: ‘విమానం’ టీజర్ ప్రేక్షకుల హృదయాలను తాకింది. వీల్ చైర్‌కు పరిమితమైన తండ్రిని.. ‘విమానం ఎక్కించవా నాన్న ఒక్కసారి’ అని కొడుకు అడిగే సంభాషణతో టీజర్ ప్రారంభమైంది. ఎయిరోప్లేన్ టేకాఫ్‌ను వీల్ చైర్ మూవింగ్‌తో పోలుస్తూ సాగిన ఈ వీడియోలో.. ఆ కొడుకు డ్రీమ్, విష్ ఫుల్ ఫిల్ చేయలేని స్థితిలో ఉన్న తండ్రి ఏం చేయగలడు అన్న ఆలోచనతో ముగుస్తుంది.

విజువల్స్, మ్యూజిక్ అద్భుతంగా ఉండగా.. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక సముద్రఖని కీలకపాత్రలో కనిపించిన ఈ చిత్రం ద్వారానే మీరా జాస్మిన్ తెలుగు ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుండగా.. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఆడియన్స్. కాగా జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్రపాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు శివ ప్రసాద్ యానాల దర్శకులు కాగా చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు.


Next Story

Most Viewed