- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హృదయాలను కదిలిస్తున్న RGV ఆసక్తికర పోస్ట్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్ట్‌లు ఒక్కోసారి పెద్ద పెద్ద వివాదాలకు దారి తీస్తే.. కొన్ని సార్లు మాత్రం ఆలోచించేలా చేస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్‌జీవీ పెట్టిన పోస్ట్ ప్రకృతి తీరు ఇంతేనా అని ఆలోచించేలా చేసింది.
నిజానికి ప్రకృతి ఎంత అందమైనదో.. అంత కృూరమైనది. అని అర్థం పట్టేలా ఆర్‌జీవీ అర్భుతమైన ట్వీట్‌ను షేర్ చేశారు. ఆ ట్వీట్‌లో.. చిరుత కోతిని చంపి నోటితో పట్టుకుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియని పిల్ల కోతి తల్లిని గట్టిగా హత్తుకుని ఉంది. ఇదే ఫొటోను షేర్ చేస్తూ.. ''ఆకలి, చావు, ప్రేమ, అమాయకత్వం.. ప్రకృతి అంతా కృూరమైనది ఏం లేదు'' అంటూ క్యాప్షన్ ఇచ్చి మరి షేర్ చేశాడు. కాగా.. ఫొటో పాతదే అయినప్పటికీ ఆర్‌జీవీ చెప్పిన విధానం మాత్రం అందరి హృదయాలను కదిలిస్తుంది అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.






