- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మాటలు నన్ను కదిలించాయి.. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు: మారి సెల్వరాజ్
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ ‘బైసన్’(Bison) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ ‘బైసన్’(Bison) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం మారి సెల్వరాజ్(Mari Selvaraj) దర్శకత్వంలోరాబోతుండగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)హీరోయిన్‌గా నటిస్తోంది. రెజిషా విజయన్, పశుపతి, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టేడియోస్ నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్లొన్న మారి సెల్వరాజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘జీవితంలో విజయం సాధించి పెద్ద స్థాయికి చేరుకోవాలంటే.. నటుడికి కోరిక ఉండాలి.
విక్రమ్ సర్ కొడుకు ఎలా ఉంటాడనే దాని గురించి మా మధ్య చర్చ జరిగింది. మేము అప్పుడు విక్రమ్ సర్‌తో మాట్లాడాము.. నేను అతనితో ఓ సినిమా తీయడం సాధారణ విషయం కాదు. అతను నాతో ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేయాలి. నేను ధృవ్‌కి శిక్షణ ఇస్తాను. అతను నన్ను నమ్మి రావాలి. మధ్యలో అతను వేరే సినిమా చేయలేడు అని చెప్పాను. అయినప్పటికీ పంపించారు. ఇది చాలా బాధాకరం. నా ప్రాజెక్ట్ కోసం అతను రెండు సంవత్సరాలు వేచి ఉన్నాడు. సినిమా మొదలుపెట్టినప్పుడు ధ్రువ్ చాలా కష్టపడ్డాడు.
దీంతో నేను మనం వేరే కథ చేద్దామని చెప్పాను. అప్పడు అతను.. అవును, ఇది చాలా కష్టం.. కానీ నువ్వు ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నావు కదా ఇది నీ కలల ప్రాజెక్ట్ లాంటిది. నేను నిన్ను నా తండ్రిలా భావిస్తాను కాబట్టి ‘బైసన్’ చేద్దాం. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావని నేను నమ్ముతున్నాను అనడంతో ఆ మాటలు నన్ను కదిలించాయి’’ అని చెప్పుకొచ్చారు.






