‘చిరంజీవ’ కోసం ఎంతగానో కష్టపడ్డాడు.. హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు..

by Mallepaka Hamsa |

రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’(Chiranjeeva).

‘చిరంజీవ’ కోసం ఎంతగానో కష్టపడ్డాడు.. హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు..
X

దిశ, సినిమా: రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’(Chiranjeeva). ఈ చిత్రంలో కుషిత కల్లపు (Kushita Kallapu)హీరోయిన్‌గా నటించగా.. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించగా.. ఈ నెల 7వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమా ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్‌లో నేను చేసిన ‘ఒరేయ్ బుజ్జి’గా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది.

ఇప్పుడు చిరంజీవ మూవీ ఈ నెల 7న ప్రీమియర్ కాబోతోంది. ఆహా సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరుతున్నా. దీని కోసం అందరం కష్టపడతాం. కానీ అభి డైరెక్టర్‌గా మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు. ఈ సినిమాలో నాతో పాటు కిరీటి, సంజయ్ కృష్ణ..ఇలా మంచి కోస్టార్స్ నటించారు. వాళ్లందరితో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ‘‘చిరంజీవ మూవీ కాన్సెప్ట్ గురించి అభి చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

అభి నాకు గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమా టైమ్ నుంచి తెలుసు. ఇందులో మంచి రోల్ చేశాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ మూవీ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. యాక్టర్స్‌ను బాగా ఇమిటేట్ చేస్తుంటాడు. ‘కందిరీగ’ సినిమాకు తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేందుకు అభి హెల్ప్ చేశాడు. అదిరే అభిగా జబర్దస్త్‌తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. రాజ్ తరుణ్‌కు కూడా ఈ సినిమా కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నా. చిరంజీవ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

Next Story