- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiranjeevi: అతను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా.. ఆ స్టార్ హీరోపై మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న ‘పెద్ది’(peddi)మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దివ్యేందు శర్మ(Divyendu Sharma) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. శివరాజ్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ చిరు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శివరాజ్ కుమార్ తండ్రి నటుడు రాజ్ కుమార్‌తో నాకు ప్రత్యేకమైన అనుభందం ఉంది.
ఆయన నాకు తండిలాంటివారు. అతను కేవలం ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు.. ఒక డెమి గాడ్. నాకు రాజ్ కుమార్‌తో ఉన్న రిలేషన్ వల్ల వారి ఫ్యామిలీ నాకు కూడా కుటుంబంలాగా మారింది. అతని కొడుకులు శివరాజ్ కుమార్, అప్పు, రాఘవేంద్ర నా ఫ్యామిలీ అనుకుంటాను. అయితే రాజ్ కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగిన శివరాజ్ కుమార్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అద్భుతమైన విజయాన్ని సాధించారు. నా కళ్ళ ముందే సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగాడో చూడటం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.
ఆయన సినిమాల్లోకి వచ్చి అప్పుడే 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం. ఈ మైలురాయిని చేరుకున్నందుకు నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నువ్వు ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని.. అభిమానులతో పాటు యువతకి మీ సినిమాలు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. శివన్నా నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఎన్ని సినిమాలు చేయాలి. మన మధ్య అనుబంధం ఇలాగే కొనసాగాలి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






