వాడు చాలా వరస్ట్ ఫెలో.. బయటకు వస్తే నా చేతిలో ఉంటదంటూ రవితేజ సీరియస్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్‌ ఎదుర్కొంటున్న మాస్ మహారాజా వరుస సినిమాలు చేస్తున్నారు.

వాడు చాలా వరస్ట్ ఫెలో.. బయటకు వస్తే నా చేతిలో ఉంటదంటూ రవితేజ సీరియస్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్‌ ఎదుర్కొంటున్న మాస్ మహారాజా వరుస సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం దగ్గడం లేదు. ఇటీవల ఆయన ‘మాస్ జాతర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా.. రవితేజ(Ravi Teja) మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. ఈ సినిమా కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో రాబోతుంది. ఇది రవితేజ కెరీర్‌లో 76వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. దీనికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026సంక్రాంతి కానుకగా.. విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా, రవితేజ సిరీయస్‌ అవుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు అందులో ఏముందంటే.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘బెల్లా బెల్లా’ అనే ఫస్ట్ సాంగ్ ని డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ప్రోమోను కూడా విడుదల చేశారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీలో రామ సత్యనారాయణ అనే పాత్రలో రవితేజ కనిపించనున్న సంగతి తెలిసిందే. అతనిలో ఉన్న మరో కోణాన్ని ఎల్విస్ పాత్ర ద్వారా పరిచయం చేసే విధంగా ఉన్న ఓ వీడియో షేర్ చేసి ఆసక్తి పెంచారు.

‘‘రామ సత్యనారాయణ ఒక్కడిలోనే కాదు.. ప్రతి మగాడిలో ఎల్విస్ లాంటోడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు మీకు ఒక వరస్ట్ ఫెలోని పరిచయం చేయబోతున్నాను. వాడి వల్లే ఇద్దరు ఆడోళ్లు నన్ను రెండు ప్రశ్నలు వేశారు. ప్రతీ ఒక్కరిలో వాడు ఉంటాడు. వాడు గానీ ఇప్పుడు బయటకు వస్తే ఉంటది’’ అని రవితేజ సీరొయస్ డైలాగ్స్ చెప్పారు. అప్పుడే ఎంట్రా వాగుతున్నావ్ అంటూ మరో రవితేజ వస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది.

Next Story