హిందీ వెర్షన్ ఇండియన్ ఐడల్ 14 విజేత అతడే.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా ?

by Gugulothu.Kavitha |

హిందీ వెర్షన్ ఇండియన్ ఐడల్ 14 విజేత అతడే.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా ?
X

దిశ, సినిమా: దేశంలోనే అత్యుత్తమ సింగింగ్ రియాల్టీ షోలలో హిందీ వెర్షన్ ఇండియన్ ఐడల్ కూడా ఒకటి. ఇప్పటి వరకు విజయవంతంగా ఈ షో 13 సీజన్‌లు పూర్తి చేసుకొగా, తాజాగా 14వ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. మొత్తం 15 మందితో ప్రారంభమైన ఈ సీజన్ లో ఆరుగురు ఫైనలిస్టులుగా నిలిచారు. ఆదివారం (మార్చి 3) జరిగిన గ్రాండ్ ఫినాలేలో.. మిగిలిన ఐదుగురిని వెనక్కి నెట్టి కాన్పూర్‌కు చెందిన వైభవ్ విజయం సాధించాడు.

కాగా ‘ఇండియన్ ఐడల్ 14’ విజేతగా నిలిచిన వైభవ్ గుప్తాకు ఏకంగా రూ.25 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఈ డబ్బుతో తాను ఏం చేస్తానన్నది కూడా అతడు షో తర్వాత వివరించాడు.. ‘ఈ షో ద్వారా నేను గెలిచిన ప్రైజ్ మనీతో సొంతంగా ఓ స్టూడియో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. అక్కడ నేను పాడే పాటలను రికార్డు చేస్తాను. నా అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. వాళ్లకు మరింత వినోదాన్ని పంచుతాను. స్టూడియో పెట్టుకోవాలన్నది ఎప్పటి నుంచో నా కలగా ఉంది’ అని వైభవ్ తెలిపాడు.

నిజానికి ఈసారి ఇండియన్ ఐడల్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఫైనలిస్ట్‌లు ఆరు మందిలో ఎవరు విజేతగా నిలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరుగురూ ఈ సీజన్ మొత్తం కూడా ఎంతో అద్భుతంగా పాడారు. పియూష్, శుభదీప్, అనన్యలలో ఒకరు విజేతగా నిలుస్తారు అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా వైభవ్ గుప్తా టైటిల్ ఎగరేసుకుపోయాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తన పెద్దమ్మ పెంపకంలో పెరిగిన వైభవ్.. ఇప్పుడో సింగింగ్ సెన్సేషన్ అయ్యాడు. ఇక ఇప్పటికీ ఈ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్లు సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి చూడాలి అనుకున్న వారు చూసేయండి.

Next Story