- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడే నాకు కొత్త జీవితం ఇచ్చాడు.. ప్రమాదం జరగడంపై బాబీ డియోల్ ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol)తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol)తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘జన నాయగన్’(Jana Nayagan) సినిమాలో నటిస్తున్నాడు. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ డియోల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘నా మొదటి మూవీ బర్సాత్ షూటింగ్ సమయంలో నా జీవితాన్ని మార్చేసిన ప్రమాదం జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్‌లో ఓ సీన్ షూట్ చేస్తుండగా..గుర్రపు స్వారీ చేస్తుండగా.. ఈ సమయంలో నేను అదుపుతప్పి పడ్డాను. అప్పుడు నాకు బలంగా పడిపోవడంతో నా కాలు విరిపోయింది.
దీంతో అప్పుడే నా కెరీర్ మొదలు కాకముందే ముగిసిపోతుందని అనుకుంటున్నాను. కానీ నా అదృష్టం బాగుండి సన్నీ డియోల్ నాతోనే ఉండి నన్ను భుజాలపై మోసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మొదట్లో వైద్యులు నా కాలు ముందు ముందు సరిగ్గా ఉపయోగించలేనని అన్నాను. దీంతో సన్నీ వెంటనే నన్ను లండన్‌లోని ఒక పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించారు. చివరకు నడవగలిగాను. సన్నీ డియోల్ నాకు కొత్త జీవితం ఇచ్చాడు’’ అని చెప్పుకొచ్చాడు.






