- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడే డబ్బులు ఇచ్చి అలా చేయించాడు.. ఇకపై ఆపేద్దామనుకుంటున్నా: అనసూయ కామెంట్స్ వైరల్
గత కొంత కాలంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఈ యాంకర్ విజయ్‌కు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతూనే ఉంది. దీంతో అతడి ఫ్యాన్స్ మండిపడుతూ అనసూయను దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఇదిలా కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. దేవరకొండ అభిమానులను ఉద్దేశించి కూడా ఆమె ఒకటి రెండు సార్లు పోస్ట్‌లు పెట్టింది. తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో హాజరై.. విజయ్‌తో తనకున్న విభేదాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. అలాగే ఇకపై అవన్నీ ఆపేద్దామనుకుంటున్నాని చెప్పింది. ‘‘విజయ్ నాకు ఎంతో కాలం నుంచి పరియమున్న వ్యక్తి. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.
అతడు హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’లో అభ్యంతరకర పదాలను మ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ చిత్రం రిలీజ్ అయినప్పుడు థియేటర్ విజిట్‌కు వెళ్లి ఆయన.. అక్కడున్న ఫ్యాన్స్‌తో ఆ పదాలను పలికించారు. ఇలాంటివి ప్రోత్సహించవద్దని విజయ్‌తో చెప్పాను. ఆ తర్వాత నాపై ఆన్లైన్ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ హీరోతో సంబంధించిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్ చేయడం కోసం పలువురికి మనీ ఇస్తున్నాడని తెలిసి షాక్ అయ్యాను. అతడికి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? అనిపించింది. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో లేదో నాకు తెలియదు. కానీ.. ఇక్కడితో దీన్ని ఆపేయాలని, ముందుకు సాగిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత కావాలి’’ అని అనసూయ చెప్పుకొచ్చారు.
Also Read: పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఇదే.. దానిని ఏం చేశారంటే?






