- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికను లోబర్చుకుని పలుకుబడితో తప్పించుకోవాలని చూస్తున్నాడు.. చిన్మయి సంచలన పోస్ట్
సింగర్ చిన్మయి( Chinmayi) నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సంచలన ట్వీట్లు చేస్తోంది.

దిశ, సినిమా: సింగర్ చిన్మయి( Chinmayi) నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సంచలన ట్వీట్లు చేస్తోంది. ఇక తనను ఏదైనా అన్న వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ.. దుమారం రేపుతోంది. ఇక ఇటీవల జానీ మాస్టర్‌కు అవకాశాలు ఇవ్వడంపై తనదైన స్టైల్లో స్పందించి వార్తల్లో నిలిచింది. అలాగే తనను మంగళసూత్రం ధరించమని చెప్పినా వారిపై ఫిర్యాదు కూడా గట్టి వార్నింగే ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, చిన్మయి మరోసారి జానీ మాస్టర్(jani master)పై ఫైర్ అయింది. ‘‘జానీ మాస్టర్ కేసు కాస్త క్లిష్టమైనది. సెక్స్‌వల్‌గా హెరాస్ చేయడమే కాకుండా అది ఇద్దరి సమ్మతితో జరిగిన అంశమంటూ కొందరు దీనిని సమర్శించుకుంటున్నారు.
ఓ మైనర్ బాలికను మేజన్ అయిన వ్యక్తి లోబరుచుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో మేజర్‌దే తప్పు అవుతుంది. పైగా బాధితురాలు తనకు సహకరించని సందర్భంలో బెదిరించి లొంగదీసుకోవాలనకోవడం దారుణం. జానీ మాస్టర్‌కు ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈ సమస్య గురించి మాట్లాడిన ప్రతిసారీ, అతని భార్య నాకు కాల్ చేసి అలా మాట్లాడవద్దని చెబుతుంది. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని అంటుంది. ఒకసారి వారికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లైతే ఇక అవార్డుల మీద అవార్డులు రావడం ఖాయం.
అతన్ని విమర్శించిన వారంతా అతని నిర్దోషిత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడతారు. మైనర్ బాలికలతో శృంగారంలో పాల్గొనడం థ్రిల్ గా ఫీలయ్యే మహానుభావులకు ఈ అంశం ఉపకరిస్తుంది. ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే... ఆ భారీ స్థాయిలో వారు విజయోత్సవం జరుపుకోవచ్చు. మైనర్లను వేధించిన తప్పించుకోవడానికి ఏమి చేయాలో వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఆశించగలిగేది, ప్రార్థించగలిగేది ఏమిటంటే, ఆ అమ్మాయి కూడా విజయం సాధించాలని కోరుతున్నా. నిందితుడిని శిక్షించి ఆమెకు న్యాయం చేయాలి’’ అని రాసుకొచ్చింది.






