త్రివిక్రమ్ కొడుకును ఎప్పుడైనా చూసారా..? వైరల్ అవుతున్న రిషి మనోజ్ ఫొటో

by Disha Web Desk 10 |
త్రివిక్రమ్ కొడుకును ఎప్పుడైనా చూసారా..?  వైరల్ అవుతున్న రిషి మనోజ్ ఫొటో
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. మాటల మాంత్రికుడిగా విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్. ఆ తరవాత సినిమాలకు దర్శకుడిగా పని చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మాస్, క్లాస్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా.. ఇలా జోనర్ ఏదైనా దానిలో త్రివిక్రమ్ మార్క్ పక్కాగా కనిపిస్తుంది. ఆయన మాటలకి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది.

సోషల్ మీడియాలో రిషి అకౌంట్లు అన్ని కూడా ప్రైవేట్ మోడ్‌లో ఉంటాయి. అతడి ఫొటోలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా బయటికి రాలేదు. అయితే, ఇప్పుడు రిషి మనోజ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా చెంబోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సాయి సౌజన్య, రిషి మనోజ్‌తో కలిసి రాజా తీసుకున్న సెల్ఫీ అది. ఈ ఫొటోలో రిషి మనోజ్‌ను చూసిన నెటిజెన్స్ అచ్చం నాన్నలానే ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యకు, రాజా చెంబోలు చాలా దగ్గర బంధువు.

Next Story

Most Viewed