చిరంజీవి ‘మెగా-158’ సినిమా లేనట్టేనా? స్పందించి క్లారిటీ ఇచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

ఈమూవీ ప్రకటించి చాలా రోజులు అవుతున్నా, షూటింగ్ ప్రారంభం కావడంలో ఆలస్యం కావడంతో.. సినిమా మొత్తానికే ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి ‘మెగా-158’ సినిమా లేనట్టేనా? స్పందించి క్లారిటీ ఇచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డుల వేట. వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్న చిరు, ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి మెగా-158 (#Mega158). బ్లాక్ బస్టర్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈమూవీ ప్రకటించి చాలా రోజులు అవుతున్నా, షూటింగ్ ప్రారంభం కావడంలో ఆలస్యం జరగడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేశాయి. చిరంజీవికి, కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే ప్రచారం జోరుగా సాగింది. మెగా ఫ్యాన్స్‌లో ఈ వార్తలు కొంత ఆందోళన కలిగించాయి. ఈక్రమంలో.. తాజాగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ పుకార్లకు చెక్ పెడుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"మా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి వస్తున్న పుకార్లను దయచేసి నమ్మకండి. మా లైనప్‌లో ఉన్న అన్ని సినిమాలు ట్రాక్‌లోనే ఉన్నాయి. త్వరలోనే పవర్‌ఫుల్ అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా వస్తాయి" అని స్పష్టం చేశారు. దీంతో మెగా-158 ఆగిపోలేదని, పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారని తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం, మెగా-158 చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మార్చి 23న అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. బాబీ ఈసారి కూడా చిరంజీవిని ఒక ఊర మాస్ రోల్‌లో చూపించబోతున్నారని, మ్యూజిక్ మరియు విజువల్స్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని తెలుస్తోంది.

Next Story