- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలీలను ట్రోల్ చేస్తున్న వారికి హరీష్ శంకర్ మాస్ వార్నింగ్.. ‘ఉస్తాద్’తో షాక్ ఇవ్వబోతున్నామంటూ కామెంట్స్
శ్రీలీల గురించి ఆన్‌లైన్‌లో జరుగుతున్న ట్రోలింగ్, ఆమె గత సినిమాలు సరిగ్గా ఆడలేదని వస్తున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల (SreeLeela)గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ ‘డాన్సింగ్ క్వీన్’, ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో నెటిజన్లు ఆమెపై దారుణమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీలీల ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ విమర్శలన్నింటికీ తన పనితోనే సమాధానం చెప్పేందుకు ఆమె సిద్ధమవుతోంది.
త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh)సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి శ్రీలీల రెడీ అయ్యింది. సెన్సేషనల్ హిట్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. శ్రీలీలపై జరుగుతున్న ట్రోలింగ్‌పై తాజాగా.. దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్రీలీల గురించి ఆన్‌లైన్‌లో జరుగుతున్న ట్రోలింగ్, ఆమె గత సినిమాలు సరిగ్గా ఆడలేదని వస్తున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.
కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలయ్యాక పరిస్థితి మారిపోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. మీరు ఇందులో కేవలం డ్యాన్సింగ్ లీలని మాత్రమే చూడరు.. ఆమెలోని మరో కోణాన్ని (నటనను) నేను ఈ సినిమా ద్వారా చూపించాను. కచ్చితంగా అది చూసి అందరూ షాక్ అవుతారు’’ అని ధీమా వ్యక్తం చేశారు. హరీష్ శంకర్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు శ్రీలీల అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాతో శ్రీలీల తనపై వస్తున్న విమర్శలన్నింటికీ చెక్ పెట్టి, మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందని అంతా భావిస్తున్నారు. మార్చి 19న పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌తో పాటు శ్రీలీల పెర్ఫార్మెన్స్ థియేటర్లలో ఏ రేంజ్ హంగామా సృష్టిస్తుందో చూడాలి.






