Harish Shankar: మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయ్యాక పవన్ గారితో అలాంటి డిస్కషన్ జరిగింది

by Pulgam srinivas |

హరీష్ శంకర్ మాట్లాడుతూ... "మిస్టర్ బచ్చన్ విడుదల అయ్యాక పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను తీసిన సినిమా ఫ్లాప్ అయ్యింది అని చెప్పాను. దానితో ఆయన నువ్వు పుట్టడంతోనే హిట్స్ తో పుట్టావా? ఓవర్ నైట్ లో నీకు సక్సెస్ వచ్చిందా? పోయి నీ పని నువ్వు చూసుకో" అని అన్నారు అని చెప్పుకొచ్చాడు.

Harish Shankar: మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయ్యాక పవన్ గారితో అలాంటి డిస్కషన్ జరిగింది
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కొంతకాలం క్రితం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ హిందీ సినిమా అయిన 'రైడ్'కి అధికారిక రీమేక్గా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. తాజాగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో హరీష్ శంకర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమా గురించి మరియు మరికొన్ని విషయాల గురించి కూడా తెలియజేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ దర్శకుడు మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాని గురించి తెలియజేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ... మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలిశాను. కలిశాక ఆయనతో సార్ నేను తీసిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయ్యింది అని చెప్పాను.

దానితో ఆయన పుట్టడంతోనే హిట్లతో పుట్టావా? ఓవర్ నైట్లో నీకు సక్సెస్ వచ్చిందా? పోయి నీ పని నువ్వు చూసుకో అన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మొదటి నుండి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తమిళ మూవీ 'తేరి'కి రీమేక్ అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా హరీష్ శంకర్ ఈ సినిమా ఏ మూవీకి రీమేక్ కాదు, కొత్త కథతో తెరకెక్కింది అని తెలియజేశాడు. దానితో ఒక్కసారిగా ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ చిత్రం కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందని పవన్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Next Story