- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవితో సినిమా చేయడంపై హరీష్ శంకర్ ఆసక్తికర కామెంట్స్..
హరీష్ శంకర్ ఇటీవల పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, హరీష్ శంకర్ ఇటీవల పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హరీష్ శంకర్‌కు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారట. ట్రైలర్‌లో డైలాగులు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయని, పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేనంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని చిరంజీవి ప్రశంసించారట. ఈ సంభాషణ తర్వాత హరీష్ శంకర్‌కు ఒక విషయం స్పష్టమైందని చెప్పారు.
చిరంజీవికి పవన్ కళ్యాణ్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు, ఒక కొడుకు లాంటి వారని ఆయన మురిసిపోతుంటే అర్థమైందని ఎమోషనల్ అయ్యారు. కేవలం ప్రశంసలతోనే ఆగకుండా, తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే విషయంపై కూడా హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాను చిరంజీవితో ఇప్పటికే కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేశానని, ఆయనతో పూర్తిస్థాయి సినిమా చేసే ప్రాసెస్ ఇప్పటికే మొదలైందని వెల్లడించారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా.. రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్ వంటి వింటేజ్ మాస్ మసాలా చిత్రాన్ని ఆయనతో కచ్చితంగా తీస్తానని మాటిచ్చారు. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేసిన ఈ ప్రకటనతో అటు పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఉగాదికి ‘ఉస్తాద్’ అరాచకం మొదలైతే, త్వరలోనే చిరంజీవితో హరీష్ చేసే మెగా మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






