పవన్ అభిమానులను షాకిచ్చిన హరీష్ శంకర్!

by Disha Web |
పవన్ అభిమానులను షాకిచ్చిన హరీష్ శంకర్!
X

దిశ, సినిమా: దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌‌గా నిలిచింది. తర్వాత వీరిద్దరూ మరోసారి జత కట్టాలని నిర్ణయించుకొని 'ఉస్తాద్ గబ్బర్ సింగ్' చిత్రం చేయనున్నారు. ఈ సినిమాను అధికారిక లాంచ్ చేయడం కూడా జరిగింది. కానీ, ఇంకా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇక ఈ మూవీ ప్రకటన చూసినప్పటి నుండి పవన్ అభిమానులు పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

అయితే అసలు విషయం ఏమిటంటే.. తమిళ హిట్ చిత్రం 'థెరి' రీమేక్ మూవీకి పవన్ మూవీ రిమేక్ అని తెలిసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. మాకు రీమేక్ చిత్రాలు వద్దు అని అభిమానులు సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరీష్ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. 'నేను అభిమానులను నా సోదరులుగా చూస్తా. అదే ఫీలింగ్‌తో నా సినిమాల విషయంలో నా ఉత్సాహాన్ని వాళ్లతో పంచుకునేవాడిన్ని. ఇటీవల వారు తమ మితిమీరిన ఉత్సాహంతో హద్దులు దాటారు. కాబట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించి అప్‌డేట్‌లను షేర్ చేయడం మానేయాలని నిర్ణయించుకున్నా' అని హరీష్ శంకర్ వెల్లడించాడు.
Next Story

Most Viewed