'Hari Hara Veera Mallu' ఇంటర్వెల్ సీన్.. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్!

by Disha Web Desk 2 |
Hari Hara Veera Mallu ఇంటర్వెల్ సీన్.. ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్‌‌గా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా 'హరిహర వీరమల్లు'. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేశారని సమాచారం. 'హీరోను బంధించిన రౌడీలు.. నీకోసం ఒక్కరొచ్చినా నిన్ను వదిలేస్తామని చెబుతారు. మొదట ఎవరూ ముందుకు రాకపోయినా, ఆ తర్వాత పవన్ కోసం పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతారు'. కాగా.. ఇదే సీన్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తుండగా.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది.


Next Story