రిలీజ్ అయి నెల రోజులవుతున్నా ‘హనుమాన్’కు తగ్గని క్రేజ్.. చాలా ఏళ్ల రికార్డ్ బ్రేక్

by Disha Web Desk 6 |
రిలీజ్ అయి నెల రోజులవుతున్నా ‘హనుమాన్’కు తగ్గని క్రేజ్.. చాలా ఏళ్ల రికార్డ్ బ్రేక్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తుంది. అంతేకాకుండా అందరి ఊహలను తిప్పికొట్టి మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేస్తే హనుమాన్ సినిమా మాత్రం ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తూ సరికొత్త రికార్డు సెట్ చేసింది.

తాజాగా, హనుమాన్ ఓ సరికొత్త రికార్డు సాధించినట్లు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సినిమా విడుదలై 30 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ఏకంగా 300 సెంటర్స్‌లో ఇంకా నడుస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఇలా స్టార్ హీరో సినిమాలే ఎక్కువ సెంటర్స్‌లో నడిచేవట. ప్రస్తుతం ఇప్పుడు హనుమాన్ సినిమా 30 రోజులైనా కానీ అన్ని సెంటర్స్‌లో ఆడటం విశేషం.

Next Story

Most Viewed