పండగ వేళ సంచలనం సృష్టిస్తోన్న హనుమాన్ దర్శకుడి ట్వీట్

by Disha Web Desk 9 |
పండగ వేళ సంచలనం సృష్టిస్తోన్న హనుమాన్ దర్శకుడి ట్వీట్
X

దిశ, సినిమా: హీరో తేజ సజ్జాకు ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ మూవీ టీం అంతా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో పలువురు ఫేక్ ఫ్రొఫైల్స్ సృష్టించి.. హనుమాన్ చిత్ర బృందంపై దాడి చేస్తున్నారని.. ఈ చెత్తను భోగి మంటల్లో కాల్చేయడం మర్చిపోయాను అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఫస్ట్ నుంచే ఈ చిత్రాన్ని తొక్కేస్తున్నారనే వాదన వినిపించింది. సంక్రాంతి బరి నుంచి ఈ మూవీని తప్పించాలని చాలా ప్రయత్నించారట. కానీ ఈ చిత్ర నిర్మాతలు ఏ మాత్రం తగ్గకుండా మూవీని రిలీజ్ చేశారు. అప్పటికే ఈ సినిమాకు చాలా తక్కువగా థియేటర్లు దక్కాయి. అయినా కూడా హనుమాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి పోటీగా రిలీజైన చిత్రాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. హనుమాన్ మాత్రం క్లీన్ హిట్‌గా నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ అయ్యింది.



Next Story

Most Viewed