Adipurush : ఆదిపురుష్ సినిమా చూడటానికి వచ్చిన రియల్ హనుమాన్! (వీడియో)

by Disha Web Desk 2 |
Adipurush : ఆదిపురుష్ సినిమా చూడటానికి వచ్చిన రియల్ హనుమాన్! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదలైంది. శుక్రవారం ఉదయం నుంచే థియేటర్లకు ఫ్యాన్స్‌ బారులు తీరారు. ప్రభాస్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం కావడంతో పాటు రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీట్ హనుమంతుడి కోసం కేటాయించాలి అంటూ దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్‌ని కోరిన సంగతి తెలిసిందే. దర్శకుడి మాటను గౌరవించి థియేటర్ ఓనర్స్ అన్ని థియేటర్లలో హనుమాన్ కోసం ఒక సీటు కేటాయించారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఓ థియేటర్లోకి కోతి వచ్చింది. థియేటర్ విండోలో నుంచి వచ్చిన ఆ కోతి ఆదిపురుష్ సినిమాని చూస్తుంటే ఒక అభిమాని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ అవ్వగా ఆదిపురుష్ మూవీ టీం కూడా ఆ వీడియోని రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.



Next Story

Most Viewed