భర్తకు విడాకులు ఇచ్చిన హన్సిక.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేయడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ హన్సిక(Hansika)కు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

భర్తకు విడాకులు ఇచ్చిన హన్సిక.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేయడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ హన్సిక(Hansika)కు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి హన్సిక క్రేజీ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. గత ఏడాది ‘105’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. హన్సిక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే సోహైల్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత నుంచి అడపా దడపా మూవీస్ చేస్తూ పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అయితే గత కొద్ది కాలంగా హన్సిక నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తన భర్తకు దూరంగా ఉంటుందని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈక్రమంలోనే హన్సిక వెకేషన్స్‌కు సైతం ఒంటరిగా వెళ్తుండటంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను కూడా డిలీట్ చేసింది. దీంతో విడాకులు వార్తలు ఎక్కువయ్యాయి. కొద్ది రోజులుగా విడాకుల వార్తలు వస్తున్నప్పటికీ హన్సిక, సోహైల్ సైలెంట్‌గా ఉన్నారు. దీంతో ఈ పుకార్లు షికారు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితి సింగిల్‌గా సెలబ్రేట్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ప్రతి ఏడాది దసరా, ఉగాది ఇలా అన్ని పండుగలను ఫ్యామిలీతో జరుపుకున్న హన్సిక ఒంటరిగా కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఈ ఫొటోలు విడాకుల వార్తలు బలం చేకూరేలా చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన నెటిజన్లు విడాకులు కన్ఫర్మ్ చేయడం కోసమే ఈ పోస్ట్ పెట్టిందని అంతా చర్చించుకుంటున్నారు. అలాగే హన్సికపై దుమ్మెత్తిపోస్తున్నారు. భర్తతో గొడవలు వస్తే పరిష్కరించుకోవాలి కానీ విడాకులు తీసుకోవాలా? అని తిడుతున్నారు. కాగా, హన్సిక తన భర్తతో కాకుండా తల్లి సోదరుడితో ఉంటుంది. సోహైల్ (Sohail)ముంబైలో తన తల్లదండ్రులతో ఉంటున్నాడని సమాచారం. వీరిద్దరు దూరంగా ఉండటానికి కారణాలు తెలియనప్పటికీ విడాకులు తీసుకోవడం వల్లే అని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story