నాతో సెక్స్ చేశానని ఆ నిర్మాత గొప్పగా చెప్పుకున్నాడు.. కొత్త అమ్మాయిలను అసలే వదలడు

by Chukka Sudharani |   (  Updated:2023-07-26 14:44:15  IST  )

దశాబ్దాలుగా మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్‌ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్ క్యారెక్టర్‌పై స్టార్ నటి గ్వినేత్ పాల్ట్రో సంచలన కామెంట్స్ చేసింది.

నాతో సెక్స్ చేశానని ఆ నిర్మాత గొప్పగా చెప్పుకున్నాడు.. కొత్త అమ్మాయిలను అసలే వదలడు
X

దిశ, సినిమా : దశాబ్దాలుగా మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్‌ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్ క్యారెక్టర్‌పై స్టార్ నటి గ్వినేత్ పాల్ట్రో సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి హార్వేతో తనకున్న అనుభవాలను వెల్లడించింది.

‘ఆయన నాతో పడుకున్నాడని గొప్పగా చెప్పుకున్నాడు. అంతేకాదు ఈ హోదాను ఉపయోగించి ఇతర నటీమణులతో సెక్స్ చేయాలనుకున్నాడు. అతని ప్రకారం.. ఇదే ఆయన చేయగలిగిన గొప్ప పని. అయితే ఇండస్ట్రీలో ఒకరితో పడుకున్నట్లు అబద్ధం చెప్పే మొదటి వ్యక్తి అతను మాత్రమే కాదు. కానీ హార్వే అబద్ధాన్ని ఆయుధంగా ఉపయోగించాడు. నన్ను ఓ సమావేశానికి హోటల్ గదికి పిలిచి లైంగిక దాడికి ప్రయత్నించాడు. నాపై చేతులేస్తూ ఒకరినొకరం మసాజ్ చేసుకోవడానికి బెడ్‌రూమ్‌కి వెళ్దామని అడిగాడు. దీంతో భయపడిపోయి అక్కడినుంచి వెళ్లిపోయాను. తర్వాత కలిసినపుడు చాలా సేపు నాపై అరిచాడు. క్రూరంగా ప్రవర్తించాడు’ అంటూ పలు విషయాలు గుర్తుచేసుకుంది.

Next Story