Guppedantha Manasu Today: ‘ఇకపై వసుధారే ఎండీ’ అంటూ మినిస్టర్ తో అనౌన్స్ చేపించిన రిషి

by Phanindra |   (  Updated:2023-10-13 08:36:06  IST  )

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Guppedantha Manasu Today: ‘ఇకపై వసుధారే ఎండీ’ అంటూ  మినిస్టర్ తో అనౌన్స్ చేపించిన రిషి
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘రిషి చెప్పిన పేరు రివీల్ చేసే ముందు అందరినీ ఒక సారి నేను మళ్లీ అడుగుతున్నాను. రిషి నిర్ణయానికి మీరంతా కట్టుబడే ఉంటారు కదా?’ అని మినిస్టర్ అడుగుతాడు. మిగిలిన బోర్డ్ మెంబర్స్ సరే అంటారు. ఇక శైలేంద్ర అయితే.. పదవి తనకే వస్తుందనే ఆశతో.. ‘మా రిషి మాటకు నేను కూడా కట్టుబడే ఉంటాను’ అంటాడు. దేవయాని తెగ సంబరడిపోతూ ఉంటుంది. ఇక మినిస్టర్ పేరు చెప్పేలోపు ఆగలేక శైలేంద్ర ముందే పైకి లేస్తాడు. కానీ మినిస్టర్ ‘వసుధార’ అని పేరు చదివేసరికి తల్లీకొడుకులు షాక్ అవుతారు. వసుధార అని మినిస్టర్ చదవగానే.. వసుధార లేచి నిలబడుతుంది. శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. ‘వసుధార ఈ పదవికి అర్హురాలు' అని మినిస్టర్ అంటాడు. అంతా చప్పట్లు కొడతారు. ఇక అప్పుడే రిషి పైకి లేచి.. ‘మీరంతా నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను. తను నా భార్య అనే అర్హతతో ఈ పదవి ఇవ్వ లేదని అంటాడు.

Next Story