Guppedantha Manasu Today: ఎమ్ఎస్ఆర్ కు ముచ్చెమటలు పట్టించిన మురుగన్..

by Phanindra |   (  Updated:2023-09-18 06:31:12  IST  )

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Guppedantha Manasu Today:  ఎమ్ఎస్ఆర్ కు  ముచ్చెమటలు పట్టించిన మురుగన్..
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

మురుగన్ ద్దబ్బులు తీసుకుని కాలేజీకి వెళ్తాడు. డబ్బులు తీసుకోలేదనుకో కథ వేరేలా ఉంటుందని ఎమ్ఎస్ఆర్ ను బెదిరిస్తాడు. అయినా ‘నువ్వు డబ్బు ఇస్తే నేనెందుకు తీసుకోవాలి?’ అని అంటాడు. ఎందుకంటే.. ‘హా.. తీసుకోకపోతే చస్తావ్ కాబట్టి’ కోపంగా అంటాడు. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? నేను ఎవరో తెలుసా? అని అడుగుతాడు. నువ్వు ఎవరో నేను ‘తెలుసుకోనప్పా.. నేను ఎవరినో, ఎవరు పంపితే ఇక్కడికి వచ్చానో నీకు తెలిస్తే అదే నీకు పెద్ద సమస్య అప్పా.. ఈ సూట్ కేసులో దుడ్లు లెక్కబెట్టుకుని తీసుకెళ్లు..అని అంటాడు మురుగన్ వెంటనే ఎమ్ఎస్ఆర్ తన వాచ్‌లో టైమ్ మార్చేసి.. ‘నేను వీళ్లకి ఆరు గంటల వరకూ టైమ్ ఇచ్చాను.. టైమ్ దాటిపోయింది. అందుకే నాకు ఇప్పుడు ఇవి వద్దు.. కాలేజ్ కావాలి’ అని పొగరుగా అంటాడు.

Next Story