త్వరలో గుడ్ న్యూస్ చెబుతానంటూ ‘Guppedantha Manasu’ సీరియల్ నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-08-28 06:39:09  IST  )

బుల్లితెర నటి జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి పాత్రలో నటించి ఫుల్ ఫేమస్ అయింది.

త్వరలో గుడ్ న్యూస్ చెబుతానంటూ ‘Guppedantha Manasu’ సీరియల్ నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి పాత్రలో నటించి ఫుల్ ఫేమస్ అయింది. ఇందులో సంప్రదాయంగా చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకున్న జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారుతుంది. జ్యోతిరాయ్‌కి పెళ్లై ఓ కొడుకు ఉన్నాడు.

అయితే భర్తతో కాకుండా ఓ డైరెక్టర్‌తో కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్‌గా మారడంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జ్యోతిరాయ్ ట్విట్టర్‌లో ఏకంగా తన పేరులో డైరెక్టర్ సుకు పుర్వాజ్ పేరు కలుపుకుని అకౌంట్ ఓపెన్ చేసింది. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ త్వరలో గుడ్‌న్యూస్’’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా డైరెక్టర్ సుకు పుర్వాజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు పెళ్లి కానీ, చేసుకుంటున్నారా అని ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: Krishna Mukunda Murari ఆగస్ట్ 28: ఈ రోజు ఎపిసోడ్ లో కృష్ణ అంటే చాలా ఇష్టమని రేవతికి చెప్పిన మురారి

Next Story