- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ డైరెక్టర్‌తో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘గుప్పెడంత మనసు’ నటి జగతి పోస్ట్ వైరల్
బుల్లితెర నటి జ్యోతిరాయ్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్ పాత్రలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి జ్యోతిరాయ్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్ పాత్రలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. సీరియల్‌లో సంప్రాదయంగా నటించిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి అందాలను చూపిస్తుంది. ఆమెకు ఆల్రెడీ పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల జ్యోతిరాయ్ ఓ కుర్ర దర్శకుడు సుకు పుర్వాజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా, జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి తన రిలేషన్ గురించి షాకింగ్ పోస్ట్ పెట్టింది. సుకు పుర్వాజ్‌తో ఉన్న పర్సనల్ ఫొటోస్ షేర్ చేసింది. క్యాప్షన్‌లో రింగ్ గుర్తుతోపాటు లవ్ బర్డ్స్ ఏమోజీని కూడా పెట్టింది. దీంతో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయినట్లు ఆమె హింట్ ఇచ్చేసింది. దీంతో వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం.






